News August 8, 2024
సంక్రాంతి తర్వాత కూటమి నిజస్వరూపం: బొత్స

సంక్రాంతి తరువాత కూటమి నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారని ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం ఆనందపురం మండలం బోయపాలెంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.
Similar News
News November 10, 2025
గాజువాక: బార్‌లో వెయిటర్ ఆత్మహత్య

గాజువాకలోని ఓ బార్‌లో వెయిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. వై.జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్‌లో చంద్రమోహన్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. బార్‌లోనే చంద్రమోహన్ ఉరివేసుకోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
News November 10, 2025
బురుజుపేటలో పాత సంప్రదాయాలే పాటించాలి..

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో EO శోభారాణి నిర్ణయాలపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సంప్రదాయ పద్ధతులు మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో భక్తులకు స్వేచ్ఛగా అభిషేకాలు, పూజలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు జల్లెడ పెడుతున్నారని, రాత్రిళ్లు గేట్లు మూసేస్తున్నారని ఆరోపించారు. ఈ విషమం MLA వంశీకృష్ణ దృష్టికి భక్తులు తీసుకెళ్లాగా పాత పద్ధతిలనే కొనసాగించాలని EOను అదేశించారు.
News November 10, 2025
13 నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీలో తరగతుల రద్దు

AU ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పార్ట్నర్షిప్ సమిట్-2025 జరగనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. హాస్టల్ విద్యార్థులు తమ గుర్తింపు కార్డులను చూపి బయటకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థినులు మద్దిలపాలెం గేటు, విద్యార్థులు పోలమాంబ ఆలయం పక్కన ఉన్న గేటు వినియోగించాలి.


