News August 8, 2024
కామారెడ్డి కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్.. డబ్బులు పంపాలని మెసేజ్

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ డిస్‌ప్లే పిక్చర్ వినియోగిస్తూ డబ్బులు పంపాలని కలెక్టరేట్ ఏటీఓకు మెసేజ్ చేశారు. కలెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ మసూర్.. కలెక్టర్ పేరిట దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 7, 2026
NZB: 14 ఏళ్ల బాలికలకు HPV టీకా ఇప్పించాలి: DMHO

14 ఏళ్ల బాలికలందరికీ HPV టీకా ఇప్పించాలని NZB DMHO రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 14 సంవత్సరాల బాలికలందరికీ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకాలు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. 7 మార్చి 2011 నుంచి 8 మార్చి 2012 మధ్యలో పుట్టిన అమ్మాయిలకు ఈ టీకా ఇప్పించాలన్నారు.
News March 7, 2026
NZB: అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి: సుదర్శన్ రెడ్డి

ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. NZB కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో కూడిన అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.
News March 6, 2026
NZB: ఐక్యంగా ముందుకు సాగి జిల్లాకు మంచి పేరు తేవాలి: CP

అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ నగరానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో CP పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. టౌన్ CI శ్రీనివాస్ రాజ్ పాల్గొన్నారు.


