News August 8, 2024

రుషికొండ: ఈనెల 21కి విచారణ వాయిదా

image

పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాల నిర్మాణంపై బాధ్యుల మీద కేసు నమోదు చేసేలా మంగళగిరి పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టీ.గంగాధర్ పిటిషన్ దాఖలు చేశారు. గత జూన్ 23న అప్పటి సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి పలువురు మంత్రులపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడింది.

Similar News

News September 13, 2025

విశాఖ చేరుకున్న జేపీ నడ్డా

image

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగత్ ప్రకాష్ నడ్డాకు శనివారం ఘన స్వాగతం లభించింది. రేపు జరగనున్న సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

News September 13, 2025

విశాఖ: లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారం

image

విశాఖ జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 124 మోటార్ ప్రమాద కేసులు పరిష్కరించారు. నష్టపరిహారం రూ.4,40,04750 అందజేశారు. 155 సివిల్ కేసులు, 10,190 క్రిమినల్ కేసులు, 239 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశారు. రాజీ మొత్తం రూ.25 కోట్లుగా చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు చిన్నంశెట్టి రాజు లోక్ అదాలత్‌ని పర్యవేక్షించారు.

News September 13, 2025

విశాఖలో 15 రోజులపాటు HIV/AIDSపై అవగాహన

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు విశాఖ జిల్లా పాఠశాలల్లో విద్యార్థులకు HIV/AIDS, లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐఈసీ కాంపెయిన్ల ద్వారా జాగ్రత్తలు, చికిత్సా అవకాశాలు, గర్భిణులకు కౌన్సెలింగ్, హెల్ప్‌లైన్ 1097 సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.నాగేశ్వరరావు తెలిపారు.