News August 8, 2024
వినేశ్ ఫొగట్ సాధించిన ఘనతలివే

* 2014, 2018, 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు.
* ఒకే ఏడాది(2018) కామన్ వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డు.
* 2019, 2022లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు కైవసం.
* 2016, 2020, 2024 ఒలింపిక్స్ బరిలో నిలిచారు.
Similar News
News October 18, 2025
ఈనెల 23న OTTలోకి ‘OG’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ‘OG’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23న ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. గత నెల 25న రిలీజైన ఈ మూవీ సరిగ్గా 4 వారాల్లోనే OTTలోకి రాబోతోంది.
News October 18, 2025
APPLY NOW: NTPCలో ఉద్యోగాలు…

NTPC లిమిటెడ్‌లో 10 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 21 ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై, న్యూక్లియర్ ఫీల్డ్‌లో పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/
News October 18, 2025
కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.