News August 8, 2024

బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

image

సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 34 ఏళ్ల సీపీఎం పాలనలో ఈయన చివరి సీఎం. 2000 నుంచి 2011 వరకు కంటిన్యూగా 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు.

Similar News

News March 8, 2026

ఇకపై గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్‌లు!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ను మూడు భాగాలుగా విభజించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాల పునర్విభజన తర్వాత పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు వేర్వేరు జడ్పీలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ మార్పులు అమలు చేసే అవకాశముంది. ప్రస్తుతం గుంటూరులో 18, పల్నాడులో 28, బాపట్లలో 20 మండలాలు ఉన్నాయి.

News March 8, 2026

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు: కవిత

image

TG: మరో రెండుమూడు నెలల్లో పార్టీ పెట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. BRSలోకి మళ్లీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు. KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తామని ఆమె ప్రకటించారు. తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలపైనా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఓడిపోవడం నిజమైతే.. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు.

News March 8, 2026

కేజీ చికెన్ ధర ఎంత ఉందంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ₹300కు చేరాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ ₹290-300, ఆసిఫాబాద్‌లో ₹300, వరంగల్‌లో ₹290, కామారెడ్డిలో ₹280-300 పలుకుతోంది. ఏపీలోని విజయవాడలో ₹300గా ఉంది. మరోవైపు గుడ్ల రేట్లు మాత్రం భారీగా తగ్గాయి. 30 గుడ్లు ఉండే ట్రే ధర ₹130-140కి పడిపోయింది. ఇక మటన్ కేజీ ₹800-1000గా ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.