News August 8, 2024

1,800 గ్రాముల బంగారంతో అన్నవరం ధ్వజస్తంభం

image

అన్నవరం దేవస్థానం అనివేటి మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడం పనులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పనులు నెల్లూరుకు చెందిన దాత సహకారంతో చేపడుతున్నారు. రాగి రేకుకు బంగారు తాపడం చేసి ధ్వజస్తంభానికి అమర్చనున్నారు. సుమారు 300 కిలోల రాగిపై 1,800 గ్రాముల బంగారంతో పనులు చేపట్టారు. 

Similar News

News August 24, 2025

పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలి: ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆగస్టు నెలకు సంబంధించి అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆదివారం నెలవారి నేర సమీక్షను తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. గంజాయి కేసుల్లో పాత నిందుతులను కచ్చితంగా రీ విజిట్ చేయాలన్నారు. పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూలు త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు.

News August 24, 2025

బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్, సబ్ జూనియర్ పురుషులు, మహిళలు, బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్లను నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం హై స్కూల్లో ఆదివారం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ జట్లు ఈనెల 29 నుంచి 31 వరకు ప్రకాశం జిల్లా చేవూరులో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు ఆలపాటి కాశీ విశ్వనాథం తెలిపారు.

News August 24, 2025

సెప్టెంబర్ 1 నుండి నూతన పాలసీ: రాహుల్ దేవ్

image

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి వస్తుందని ఏపీ ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కొత్త పాలసీలో 10% బార్లను కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. బార్లకు లైసెన్స్ ఫీజు తగ్గించడంతో పాటు వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు అవకాశం కల్పించారన్నారు. బార్ల పనివేళలు ఉదయం 10గం: నుంచి రాత్రి 12 గం: వరకు ఉంటాయన్నారు.