News August 8, 2024
రూ.9.90 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్

గత ఐదేళ్లలో బ్యాంకులు రూ.9.90 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్టు కేంద్రం నిన్న రాజ్యసభలో వెల్లడించింది. రైటాఫ్ చేసినంత మాత్రానా రుణాలను పూర్తిగా రద్దు చేసినట్టు కాదని, లోన్లు తీసుకున్న వారు వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోంది. బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడానికి, పన్ను ప్రయోజనాలు పొందడానికి బ్యాంకులు రుణాలను రైటాఫ్ చేస్తుంటాయని వివరించింది.
Similar News
News March 24, 2026
ఇరాన్-US చర్చలకు సిద్ధమన్న పాక్.. స్పందించిన ట్రంప్!

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై పాక్ PM షరీఫ్ చేసిన ట్వీట్‌ను US అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేశారు. పరోక్షంగా పాక్ రిక్వెస్ట్‌ను స్వాగతించారు. మరోవైపు ఇస్లామాబాద్‌కు US ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెళ్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. అక్కడ ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నెర్‌తో కలిసి చర్చల్లో పాల్గొంటారని వెల్లడించింది.
News March 24, 2026
మన దగ్గర ఎన్నిరోజులకు సరిపడా ఇంధనం ఉందంటే..

దేశంలో దిగుమతులకు అంతరాయం ఏర్పడితే మన క్రూడాయిల్ రిజర్వులు(100% కెపాసిటీ) 9.5 రోజులకే సరిపోతాయని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు(SPR)ల్లో 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ నిల్వ ఉందని తెలిపింది. APలోని విశాఖ, KAలోని మంగళూరు, పాదూర్‌లో ఈ రిజర్వులు ఉన్నట్లు వివరించింది. వీటి మొత్తం కెపాసిటీ 53.3L MT అని పేర్కొంది. RTI ద్వారా India Today అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.
News March 24, 2026
యుద్ధం.. బీర్లు తాగేవారికి షాక్!

దేశంలో బీర్ల ధరలు పెరుగుతాయని, సరఫరాకు కొరత ఏర్పడొచ్చని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(BAI) తెలిపింది. ‘యుద్ధం వల్ల తయారీ ఖర్చు 12-15% పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ధరలు ఉన్నాయి’ అని పేర్కొంది. సీసాల ధరలు 20%, మెటీరియల్స్ రేట్లు 20-25%, రవాణా ఖర్చులు 10% పెరిగాయి. BAIలోని యునైటెడ్ బ్రూవరీస్, కార్ల్స్‌బర్గ్, AB InBev తదితర కంపెనీలు దేశంలో 85% బీర్లు అమ్ముతున్నాయి.


