News August 8, 2024

త్వరలో తిరుపతికి ఓబరాయ్ హోటల్స్

image

తిరుపతిలో ఏడు నక్షత్రాల ఓబెరాయ్ హోటల్స్ కు స్థలాన్ని కేటాయించినా గత ప్రభుత్వంలో కొన్ని కారణాలు చేత ప్రాజెక్టు అటకెక్కింది. ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్వీ జూపార్కు సమీపంలో (దేవలోక్) ఓబెరాయ్ హోటళ్ల కోసం కేటాయించిన స్థలాన్ని టూరిజం, రెవిన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు. సంబంధిత అధికారులకు కలెక్టర్ తగు సూచనలు చేశారు.

Similar News

News March 12, 2026

చిత్తూరు: వంట గ్యాస్ కోసం పరుగులు.!

image

రొంపిచర్ల మండలంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు గోడౌన్ వద్దకు పరుగులు తీస్తున్నారు. రెండు రోజులుగా వినియోగదారులతో గ్యాస్ ఆఫీస్ కిటకిటలాడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకదేమో అని జాగ్రత్తలు పడుతున్నారు. రంజాన్, ఉగాది పండుగలు వస్తుండటంతో వంటగ్యాస్ కోసం ఆరాటపడుతున్నారు. బుక్ చేసి OTP చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు. మరి కొంత మంది నెట్వర్క్ పనిచేయక నిరాశ చెంది వెనుతిరుగుతున్నారు.

News March 11, 2026

చిత్తూరులో 13న ముస్లింలకు ఇఫ్తార్ విందు

image

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు “ఇఫ్తార్ విందు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీ శుక్రవారం 5:30 గం.లకు చిత్తూరు నగరంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఉర్దూ షాదీ మహల్‌లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విందు ఏర్పాటు చేశారు.

News March 11, 2026

చిత్తూరు జిల్లా అధికారులు తనిఖీలు చేసేనా?

image

గ్యాస్ డిమాండ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల పంపిణీని నిలిపివేయడంతో గృహ అవసరాల సిలిండర్లని హోటళ్లకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు గ్యాస్ పక్కదారి పట్టకుండా షాపులపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.