News August 8, 2024

RBI కీలక నిర్ణయాలు

image

UPI ద్వారా పన్ను చెల్లింపు పరిమితిని రోజుకు ₹లక్ష నుంచి ₹5 లక్షలకు పెంచుతూ RBI నిర్ణయం తీసుకుంది. చెక్ క్లియరెన్స్ గడువును 2 వర్కింగ్ డేస్ నుంచి గంటలకు కుదించింది. గత DECలో ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో చెల్లింపు పరిమితిని ₹5 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. మూడేళ్ల కిందట IPO, రిటైల్ డైరెక్ట్ స్కీమ్ లావాదేవీల పరిమితిని ₹5లక్షలకు, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్‌ను ₹2 లక్షలకు పెంచింది.

Similar News

News January 23, 2025

ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం: చంద్రబాబు

image

CMలుగా వేర్వేరు పార్టీలకు చెందినా ప్రజల కోసం ఐక్యంగా ఆలోచిస్తామని AP CM <<15229916>>చంద్రబాబు<<>> అన్నారు. ‘కలిసి పనిచేస్తే వికసిత భారత్ సాధ్యమే. వ్యవసాయం, మానవాభివృద్ధిలో డీప్ టెక్ లాంటి సాంకేతికత రావాలి. ప్రస్తుతం ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం. పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధిరేటులో AP కృషి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 165గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నాం’ అని దావోస్‌లో చంద్రబాబు తెలిపారు.

News January 23, 2025

జనవరి 23: చరిత్రలో ఈరోజు

image

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం

News January 23, 2025

ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్: చంద్రబాబు

image

దావోస్‌లో పెట్టుబడులకు పోటీ పడుతున్నా అందరిదీ టీంఇండియాగా ఒకే లక్ష్యం అని AP CM చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి దావోస్‌కు హాజరవుతున్న వారిలో నేనే సీనియర్‌. 1997 నుంచి వస్తున్నాను. గతంలో భారత్‌కు గుర్తింపు తక్కువగా ఉండేది. ఇప్పుడు గొప్ప గుర్తింపు వచ్చింది. 2028నాటికి భారత్‌లో ఇంక్రిమెంట‌ల్ గ్రోత్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్’ అని దేశం తరఫున నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో CBN చెప్పారు.