News August 8, 2024

నల్లగొండలో రాజకీయ దుమారం

image

నల్లగొండ రాజకీయాలు మళ్లీ హీటెక్కిస్తున్నాయి. NLG నడిబొడ్డున బీఆర్ఎస్ నిర్మించిన జిల్లా పార్టీ ఆఫీసుపై రాజకీయ దుమారం రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పార్టీ ఆఫీసును కూల్చివేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారమే నిర్మించామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News March 12, 2026

కొండమల్లేపల్లిలో 60 సిలిండర్లు సీజ్

image

కొండమల్లేపల్లిలో పౌర సరఫరాల శాఖ అధికారులు హోటల్, రెస్టారెంట్, దాబాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ముబీన్, దీపక్, సైదులు, ముక్తర్, జ్యోతి, కుమార్ పాల్గొన్నారు.

News March 12, 2026

NLG: IFSC కోడ్ మార్పుతో అన్నదాతల అవస్థలు

image

బ్యాంకుల విలీనం, పేరు మార్పు వల్ల తలెత్తిన సాంకేతిక సమస్యలు నల్గొండ జిల్లాలోని వేలాది మంది రైతుల పాలిట శాపంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌గా మారడంతో IFSC కోడ్‌లు మారిపోయాయి. కాగా, ప్రభుత్వం పాత కోడ్‌ల ఆధారంగా నిధులు విడుదల చేసింది. ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్’ ఫెయిల్ అయ్యి సుమారు 7,041 మంది రైతులకు రుణమాఫీ సొమ్ము జమ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 12, 2026

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.