News August 8, 2024

ఏయూలో పీజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల పరిధిలోని ఎం.కామ్ మూడవ సెమిస్టర్, ఎం.ఏ ఏన్షియంట్ హిస్టరీ ఆర్కియాలజీ మొదటి సెమిస్టర్ రీవాల్యుయేషన్, ఎంబీఏ (బి.ఎఫ్.ఎస్) నాలుగో సెమిస్టర్, ఎంబీఏ (ఆర్.ఎం) 4వ సెమిస్టర్, ఎంబీఏ (ఎఫ్.టి) నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎంబీఏ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

Similar News

News March 10, 2026

అగనంపూడి హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

అగనంపూడి టోల్గేట్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అగనంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు బలిరెడ్డి కిషోర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన మైలురాయిను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

News March 10, 2026

విశాఖలో సెయింట్ గోబైన్ జిప్రాక్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

image

సెయింట్ గోబైన్‌కు చెందిన జిప్రాక్ విభాగం విశాఖలో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. 2025 డిసెంబరులో ప్రారంభమైన ఈ ఆధునిక కేంద్రం దేశంలోనే తక్కువ కార్బన్ ఉద్గారాలతో పనిచేసే జిప్సం పైకప్పు పలకల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందింది. సంవత్సరానికి సుమారు 50 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ పెట్టుబడి భారతదేశంలో తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

News March 10, 2026

విశాఖలో నేడు అంతర్జాతీయ నీటి భద్రతా సదస్సు

image

విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం నోవాటెల్ హోటల్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెరుగుతున్న నీటి అవసరాలు, వనరుల సమర్థ వినియోగం, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారని అధికారులు పేర్కొన్నారు.