News August 8, 2024

నెల్లూరు జిల్లాలో దొంగలు బాబోయ్ దొంగలు

image

ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా ప్రజలకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బుధవారం రాత్రి రూరల్ పరిధిలోని దర్గామిట్టలోని ఓ ఇంట్లో సుమారు 2.3 లక్షల నగదు దోచుకెళ్లారు. అదేవిధంగా వేంకటేశ్వర పురంలోని విజయ డెయిరీ మాజీ ఉద్యోగి గోళ్ళ సుబ్బారావు ఇంట్లో బంగారం, వెండి, నగదు మొత్తం కలిపి రూ.10 లక్షల విలువ గల సొత్తు చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News November 10, 2025

జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

image

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్‌లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 10, 2025

జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

image

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.

News November 9, 2025

కోవూరులో స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి

image

స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి చెందిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. కోవూరు గ్రామంలోని లక్ష్మీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్లాబ్ పనులను కార్పెంటర్ పట్నం ప్రసాద్‌ (48) చేస్తుండగా ప్రమాదవశాత్తు స్లాబ్ కూలి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.