News August 8, 2024
కర్ణాటక సీఎంతో పవన్ భేటీ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు ఊళ్లలోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చింది. వీటిని అడవుల్లోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉండటంతో కొన్నింటిని ఏపీకి తరలించాలని కోరేందుకు పవన్ బెంగళూరుకు వెళ్లారు.
Similar News
News January 13, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <
News January 13, 2026
పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
News January 13, 2026
51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


