News August 8, 2024

PHOTOS: నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్

image

తన కుమారుడు నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ రోజు ఉదయం 9.42 నిమిషాలకు ఈ శుభ కార్యక్రమం నిర్వహించినట్లు ట్వీట్ చేశారు. ఆమెను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్ ఆశీర్వదించారు. దేవుని ఆశీర్వాదం వాళ్లకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Similar News

News January 15, 2025

కనుమ ఎఫెక్ట్.. మటన్, చికెన్ షాపుల వద్ద ఫుల్ రష్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న భోగి, నిన్న సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు మందు, మటన్, చికెన్ ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో మటన్, చికెన్ షాపులకు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. అటు నాటు కోళ్ల కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.

News January 15, 2025

ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం

image

ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.

News January 15, 2025

హీరో పేరిట మోసం.. ₹7కోట్లు పోగొట్టుకున్న మహిళ!

image

తాను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్‌నంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53)ను మోసం చేశాడు. ఆన్‌లైన్ పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. 2023 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని, మహిళ నుంచి ₹7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్‌తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.