News August 8, 2024

HYDలో పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం

image

AP క్యాబ్ డ్రైవర్లను HYDలో తిరగనివ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్స్ నాయకులు మండిపడ్డారు. మోటర్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించడం నేరమని క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ పేర్కొన్నారు. కాగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన క్యాబ్ డ్రైవర్ల వాగ్వాదం చిలికి చిలికి, గాలి వానలా మారింది.

Similar News

News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.

News October 1, 2024

రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

రంగారెడ్డి జిల్లా కోర్టులో లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు రంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. జానీ మాస్టర్‌ఫై అత్యాచార కేసుతో పాటు ఫోక్సో కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు.

News October 1, 2024

HYD: హైడ్రాను రద్దు చెయ్యాలని హైకోర్టులో పిటిషన్

image

హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖాలు అయ్యాయి. పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, జీవో నెంబర్ 99ను వెంటనే రద్దు చేయాలను కోరుతూ పిటీషన్ దాఖలు కావడంతో దీని తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.