News August 8, 2024

బంగ్లాలో మైనారిటీలను రక్షించాలి: ఒవైసీ

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌నే వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు అనుగుణంగా మైనారిటీల‌ను, వారి అస్తుల‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త అక్క‌డి ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. మైనారిటీల‌ ఇళ్ల‌ను, ప్రార్థనా స్థలాలను మెజారిటీ వ‌ర్గం ప్రజలు ర‌క్షిస్తున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, ఇదే కొనసాగించాలని ఆకాంక్షించారు.

Similar News

News January 16, 2025

సంక్రాంతి సీజన్‌లో తొలిసారి.. అన్నీ రూ.100 కోట్ల క్లబ్‌లోనే!

image

సంక్రాంతి బరిలో నిలిచే అన్ని సినిమాలు హిట్‌ అవ్వవు. అలాగే కలెక్షన్లూ రాబట్టలేవు. కానీ, ఈ ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలు ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా నేడు వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఆ మార్క్ దాటనుంది. ఇలా సంక్రాంతి సీజన్‌లో అన్ని మూవీస్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం మొదటిసారి కానుందని సినీవర్గాలు తెలిపాయి.

News January 16, 2025

BREAKING: సముద్రంలో మునిగి ముగ్గురు మృతి

image

AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోగా, ఒకరిని జాలర్లు కాపాడారు. మరో వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. మృతులను పొన్నలూరు మండలం తిమ్మపాలెం వాసులుగా గుర్తించారు. డెడ్ బాడీలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News January 16, 2025

శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్: అశ్వినీ వైష్ణవ్

image

శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్(NGLV) ద్వారా భారీ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈ లాంచ్‌ప్యాడ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. అందుకు రూ.3,985 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.