News August 8, 2024
UPSC అభ్యర్థికి వరల్డ్ వార్-2 నాటి వ్యాధి

‘పైలోనిడల్ సైనస్’ అనే వ్యాధితో బాధపడుతున్న ఓ UPSC అభ్యర్థికి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. లైబ్రరీ కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులలో తొలిసారి గుర్తించారు. పిరుదుల పైభాగంలో ఓ చీలిక ఏర్పడి, ఇందులో వెంట్రుకలు, చెత్త పేరుకుపోయి చీము పడుతూ ఉంటుంది. దీనివల్ల రోగికి తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది.
Similar News
News September 16, 2025
భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
News September 16, 2025
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.