News August 8, 2024
ఫిక్సింగ్ కలకలం.. శ్రీలంక ఆటగాడిపై ఐసీసీ చర్యలు

ఫిక్సింగ్‌కు ప్రయత్నించిన శ్రీలంక బౌలర్ ప్రవీణ్ జయవిక్రమపై ICC 3 అభియోగాలు మోపింది. ‘ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఫిక్సింగ్ కోసం సంప్రదించిన వారి గురించి అతను నివేదించలేదు. LPLలో ఫిక్సింగ్ కోసం మరో ఆటగాడిని సంప్రదించారు. మెసేజ్‌లను డిలీట్ చేసి విచారణకు ఆటంకం కలిగించారు. ఇందుకుగాను చర్యలు తీసుకునేందుకు లంక బోర్డు, ICC నిర్ణయించాయి’ అని పేర్కొంది. వీటిపై స్పందించేందుకు ఆటగాడికి 14 రోజుల సమయం ఇచ్చింది.
Similar News
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.
News April 18, 2026
IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.
News April 18, 2026
SRHలోకి సౌతాఫ్రికా పేసర్

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.


