News August 8, 2024
గోల్కొండ కోటపై జెండా ఎగరవేయనున్న సీఎం రేవంత్

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తదితర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Similar News
News November 6, 2025
HYD: కార్తీక దీపాల మంటల్లో బాలిక దుర్మరణం

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కార్తీక పౌర్ణమి వేళ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్ఎల్ నగర్‌వాసి మధుసూదన్ రెడ్డి కూతురు సాయి నేహారెడ్డి (7) ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తన దుస్తులకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్‌పురి అంకురా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కార్ఖానాలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
News November 6, 2025
సురవరం ప్రతాప్‌రెడ్డి వర్సిటీలో యువకుడి ఆత్మహత్య

బాచుపల్లి PS పరిధిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో కలకలం రేగింది. పోలీసుల వివరాలిలా.. బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ కోర్సులో 3rd ఇయర్ చదువుతున్న పరశురాం అనే వ్యక్తి హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.


