News August 8, 2024

రాజమండ్రి: ఎన్నికల ఖర్చు రూ.80 లక్షలు..!

image

రాజమండ్రిలోని ది ఆర్యాపురం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఎన్నికలలో కూటమి అభ్యర్థులు గెలిచి బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ఎన్నికల వ్యయానికి సంబంధించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఖర్చును రూ.80 లక్షలకు పైగా చూపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుమారు రూ.40-రూ.45 లక్షలు కూడా ఖర్చు అవ్వదనే మాట గట్టిగా వినిపిస్తోంది. అవి పలు అనుమానాలుకు దారి తీస్తున్నాయి.

Similar News

News October 18, 2025

రాజమండ్రి: నార్కో కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశం

image

తూర్పు గోదావరి జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలలో చైతన్యం పెంచి, యువత గంజాయికి దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News October 18, 2025

నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నిడదవోలు మండలం మునిపల్లి – కలవచర్ల మార్గంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మునిపల్లికి చెందిన అత్తిలి నాగరాజు (45) మృతి చెందాడు. కోరుపల్లి అడ్డరోడ్డు వద్ద నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు.

News October 18, 2025

నిడదవోలు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

image

నిడదవోలు మండలం డి. ముప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు, కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ, ఆర్డీఓ సుస్మితా రాణి పాల్గొన్నారు.