News August 8, 2024
సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో ఎంగేజ్మెంట్?

సమంత తనకు ప్రపోజ్ చేసిన రోజే నాగచైతన్య ప్రేయసి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఏమాయ చేశావే’ రిలీజయ్యాక ఆగస్టు 8వ తేదీన సమంత ప్రపోజ్ చేశారని చెబుతున్నారు. దీంతో ఇదేరోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ శుభకార్యానికి ముందే చైతూ తన మాజీ భార్యతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలగించారు. కేవలం ‘మజిలి’ సినిమా ఫొటోలే ఉన్నాయి.
Similar News
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘శూలపాణి’’

శివుడి ఆయుధం త్రిశూలం. దీనిని చేతిలో ధరించిన వాడు కాబట్టి ఆయన ‘శూలపాణి’ అయ్యాడు. త్రిశూలంలోని మూడు కొనలు సత్వ, రజ, తమ గుణాలకు; అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంకేతం. వాటన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని లోకాన్ని రక్షించేవాడు శివుడు. మనలోని అరిషడ్వర్గాలను తన శూలంతో సంహరించి, మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండే రక్షకుడు ఆయన.
News February 13, 2026
ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.
News February 13, 2026
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీలోని <


