News August 8, 2024

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో లక్ష పత్రి పూజలు

image

మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర మక్తేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో లక్ష్యపత్రి పూజలను గురువారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. లక్ష పత్రి పూజలు చేయడం ద్వారా గురువారం రూ.85,000 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

Similar News

News November 27, 2024

వానాకాలం పోయి యాసంగి వచ్చే.. రైతు భరోసా రాకపోయే: KTR

image

యాసంగి పోయి వానాకాలం వచ్చింది, వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చింది కానీ రైతు భరోసా రాకపోయే అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన రైతు భరోసా మీద వేసిన మంత్రి వర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో? ఎప్పటి నుంచి ఇస్తారో? అసలు ఇస్తారో, ఇవ్వరో? ఇప్పటి వరకూ స్పష్టత లేదన్నారు.

News November 27, 2024

సోలార్ విద్యుత్ పొదుపునకు వినూత్న ఆవిష్కరణ

image

సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యలలో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్‌లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ విద్యుత్‌ను వృథాగా పోనీయకుండా బ్యాటరీలో నిల్వ చేసే ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’ ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేస్తోందని సంస్థ C&MD బలరాం ప్రకటనలో తెలిపారు.

News November 27, 2024

కరీంనగర్ రీజియన్‌లో 104 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు కరీంనగర్ రీజియన్‌లో 104 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి.అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.