News August 8, 2024
గుడిలో ప్రదక్షిణం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
గుడిలో ఎందుకు క్లాక్ వైజ్లోనే ప్రదక్షిణం చేస్తారో తెలుసా? ప్రదక్షిణం చేసే వ్యక్తికి మూలవిరాట్టు ఎప్పుడూ కుడివైపుగా ఉండాలి కాబట్టి. ఒకవేళ ఎడమవైపు వచ్చేలా నడిస్తే దానిని అప్రదక్షిణం అంటారు. వయసులో పెద్దవారికి సైతం కుడివైపునే నిల్చోవాలంటారు. అందుకే తనకంటే పెద్దవారైన భర్త తనకు కుడివైపున ఉండేలా భార్య నిల్చుంటుంది. అయితే, శివాలయంలో ప్రదక్షిణల తీరు వేరుగా ఉంటుంది. రేపు ఆ విషయాన్ని తెలుసుకుందాం.
Similar News
News January 16, 2025
BREAKING: భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోలు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల మావోలు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే.
News January 16, 2025
జారిపడ్డ పోప్.. చేతికి గాయం
పోప్ ఫ్రాన్సిస్ గాయపడ్డట్లు వాటికన్ సిటీ అధికారులు తెలిపారు. శాంటా మార్టాలోని తన నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు జారి పడటంతో మోచేతికి గాయమైనట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ కాలేదని, గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. కాగా గడిచిన రెండు నెలల్లో పోప్ గాయపడటం ఇది రెండోసారి. ఇటీవల ఆయన బెడ్ పైనుంచి కింద పడటంతో దవడకు దెబ్బ తగిలింది.
News January 16, 2025
రేపు ఓటీటీలోకి విడుదల-2?
వెట్రిమారన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన విడుదల-2 రేపు ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంటున్నాయి. ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల నిడివితో మూవీ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయినా వెట్రిమారన్ టేకింగ్, సేతుపతి నటన హైలైట్గా నిలిచాయి.