News August 8, 2024
వారికి రూ.10,000 ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు

AP: బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానం చేసిన వారి పార్థివదేహాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్/సీనియర్ అధికారి ఈ సంస్కారాల్లో పాల్గొనాలని ఆదేశించింది. దాతల కుటుంబాలకు ₹10,000 పారితోషికం, ప్రశంసా పత్రాలు అందించాలని మంత్రి సత్యకుమార్ చొరవతో ఉత్తర్వులు ఇచ్చింది. అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుండి భౌతికకాయం ఉచితంగా తరలించాలంది.
Similar News
News February 3, 2026
KNR: కాంగ్రెస్లో ఆశావాహుల అసంతృప్తుల వెల్లువ

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల వెలువ పెక్కు బిల్లుతోంది. మొదటి నుంచి పార్టీలో పని చేసే వారికి కాకుండా 15 రోజుల క్రితం, నెలరోజుల క్రితం వచ్చినవారికి టికెట్లు కేటాయించారని పలువురు ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 45వ డివిజన్ యువజన కాంగ్రెస్ యూత్ నాయకుడు అజయ్ బహిరంగంగానే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిపై ఆరోపణలు చేయగా పలువురు అదే దిశలో ఉన్నారు.
News February 3, 2026
మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్ ప్యాకెట్ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.
News February 3, 2026
ఇండియాలో ఫార్ములా వన్ రీఎంట్రీ!

ఇండియాలోకి ఫార్ములా వన్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్రం, ఫార్ములా వన్ యాజమాన్యం మధ్య ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. 2011లో నోయిడా సర్క్యూట్‌లో దేశంలోనే తొలిసారి F1కార్లు పరుగులు తీశాయి. 2013లో చివరి సారిగా రేసు జరిగింది. భారీ పన్నులు, ఇతర సమస్యలతో ఇండియాకు F1 దూరమైంది. 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు జరిగిన విషయం తెలిసిందే.


