News August 8, 2024

PIC OF THE DAY

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం భారత గోల్‌పోస్ట్‌కు అతడు అడ్డుగోడలా నిలబడ్డారు. అయితే శ్రీజేశ్‌కు ఇదే చివరి మ్యాచ్. ఒలింపిక్స్‌ తర్వాత రిటైర్‌ అవుతానని అతడు గతంలోనే ప్రకటించారు. దీంతో ఇవాళ మ్యాచ్ ముగిసిన తర్వాత గోల్‌పోస్ట్‌ పైకి ఎక్కి కూర్చున్న అతడి ఫొటోలు వైరల్‌ అవతున్నాయి. ‘THANK YOU LEGEND’ అంటూ క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 18, 2025

నేడు రాష్ట్రానికి అమిత్ షా

image

AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్‌లో బస చేయనున్నారు. రేపు గన్నవరంలో సమీపంలోని NIDM సెంటర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

News January 18, 2025

ముడా కేసులో సిద్ధ రామయ్యకు ఈడీ షాక్

image

ముడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు.

News January 18, 2025

జనవరి 18: చరిత్రలో ఈరోజు

image

1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం
1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం
1975: సినీ నటి మోనికా బేడి జననం
1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం
2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం