News August 9, 2024

నేటి ముఖ్యాంశాలు

image

☞ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు
☞ ఇది తరాలపాటు గుర్తుండే విజయం: ప్రధాని మోదీ
☞ ఏపీలో జన్మభూమి కార్యక్రమాలు: TDP
☞ కర్ణాటకతో AP ప్రభుత్వం ఒప్పందాలు
☞ CM రేవంత్ US పర్యటనలో పెట్టుబడులపై ఒప్పందాలు
☞ TG: రేషన్ కార్డులపై సబ్ కమిటీ ఏర్పాటు
☞ కీలక వడ్డీరేట్లలో మార్పులు చేయని RBI
☞ JPCకి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు
☞ రిటైర్మెంట్ ప్రకటించిన రెజ్లర్ వినేశ్ ఫొగట్

Similar News

News February 1, 2025

Stock Markets: బడ్జెట్‌కు ముందు మార్కెట్లు అప్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 25,555 (+50), సెన్సెక్స్ 77,695 (+210) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీసీ హోటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బీఈఎల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్. హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, గ్రాసిమ్, ట్రెండ్ టాప్ లూజర్స్.

News February 1, 2025

బంగారం @ All Time High

image

బంగారం భగభగమంటోంది. మునుపెన్నడూ చూడని విధంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తొలిసారి ఔన్స్ విలువ $2817 వద్ద All Time Highని టచ్ చేసింది. ప్రస్తుతం $2797 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, US ఫెడ్ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం, డీడాలరైజేషన్, ట్రంప్ టారిఫ్స్‌తో ట్రేడ్‌వార్స్ ఆందోళనే ఇందుకు కారణాలని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌లో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.84,340 వద్ద కొనసాగుతోంది.

News February 1, 2025

ఇడ్లీ, దోశ తింటే బరువు పెరుగుతారా?

image

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ తింటారు. వీటిని మితంగా తింటే ఎలాంటి బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీ, దోశల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు. కానీ ఇడ్లీ, దోశల్లో అధిక మోతాదులో నూనె, రిచ్ చట్నీస్, మసాలాలు దట్టించడం, ఇడ్లీలు ఫ్రై చేసి తింటే మాత్రం కేలరీలు పెరిగి బరువు కూడా పెరుగుతారు.