News August 9, 2024
కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి: అనంత కలెక్టర్

ఇళ్ల నిర్మాణాలను వెంటనే మొదలుపెట్టి, శుక్రవారం నుంచి పనుల్లో పురోగతి చూపించాలని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 100 రోజుల్లో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం కేటాయించిందని అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేసి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 4, 2026
పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై దుష్ప్రచారం

ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1993 డిసెంబర్ 21న పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటనను తాజాగా జరిగినట్టుగా, బంగారు విగ్రహాల విలువ రూ.150 కోట్లుగా వక్రీకరిస్తున్నారు. అయితే అప్పట్లోనే ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విగ్రహాల విలువ రూ.50 వేలుగా నమోదు చేసి, 1994లో కేసు మూసివేశారు.
News March 4, 2026
అనంతపురంలో పడిపోయిన ధరలు

చీనీ, టమాటా ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.25,000, కనిష్ఠంగా రూ.8 వేల ధర పలికింది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాటా బండిలో క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.8 వేలు, కనిష్ఠంగా రూ.4 వేల ప్రకారం ధర పలికింది.
News March 3, 2026
అనంత: జాగ్రత్త.. ఇది డేంజర్ స్పాట్

కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి వద్ద హైవే మలుపు డేంజర్ స్పాట్‌గా మారింది. ఇటీవల అక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 15 రోజుల క్రితం 2 బైకులు డీకొన్న ఘటనలో ఒకరు మరణించారు. నెల రోజుల క్రితం అక్కడే ట్రాక్టర్, కారు డీకొన్నాయి. మలుపు ప్రమాదకరంగా మారడంతోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.


