News August 9, 2024

పార్వతీపురం: NMMS స్కాలర్ షిప్ పరీక్ష‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు జిల్లాలోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. డిశంబరు 08వ తేదీన ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Similar News

News September 30, 2025

సీఎం చంద్రబాబు టూర్ టైమింగ్స్ ఇవే..

image

➤ఉదయం 11:10 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు
➤ఉదయం 11:20కి హెలీకాప్టర్‌లో స్టార్ట్ ➤ఉదయం 11:30కి దత్తి హెలీప్యాడ్‌కు చేరిక
➤11:40 వరకు ప్రముఖుల ఆహ్వానం ➤11:50కి దత్తి గ్రామానికి రోడ్డు మార్గంలో చేరిక
➤11:50 నుంచి మ.12:05 వరకు డోర్ టూ డోర్ పింఛన్ల పంపిణీ
➤12:10కు ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు ➤ మధ్యాహ్నం 2:10 వరకు ప్రజా వేదిక వద్ద
➤2:15కి పార్టీ కేడర్‌తో మీటింగ్ ➤సా.4 గంటలకు తిరుగు ప్రయాణం

News September 30, 2025

సీఎం పర్యటన.. 600 మంది బందోబస్తు: VZM SP

image

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News September 30, 2025

ఎస్.కోట: చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

image

తన చదువుకి తగ్గ సరైన ఉద్యోగం దొరకలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ నరసింహమూర్తి వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన గోకాడ ప్రదీప్ హైదరాబాదులో ఓ నెట్వర్క్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. సొంత గ్రామం కొత్తూరుకు 28న వచ్చాడు. 29న ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తండ్రి బాపు నాయుడు ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.