News August 9, 2024
ఆ బాలీవుడ్ హీరోతో నటించాలని ఉంది: రామ్ పోతినేని

తనకు బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో కలిసి పనిచేయాలని ఉందని హీరో రామ్ పోతినేని అన్నారు. ‘సంజూ’ మూవీలో రణబీర్ చేసిన సంజయ్ దత్ పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. అవకాశమొస్తే అతనితో కలిసి నటిస్తానని రామ్ తెలిపారు. ‘డబుల్ ఇస్మార్ట్’కు A సర్టిఫికెట్ రాగా 2 గంటల 42 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం. ఈ నెల 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Similar News
News September 19, 2025
పెద్దపల్లి: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా మధు

పెద్దపల్లి జిల్లా జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా కట్టేకోల మధుని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఆముల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోచం మల్లయ్య, ఉపాధ్యక్షులుగా మద్దెల రామకృష్ణ, మట్ట రాజయ్య, కార్యదర్శులుగా చెవుల రాజయ్య, బండ రాజులను నియమించారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపార
News September 19, 2025
మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
News September 19, 2025
SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్‌మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?