News August 9, 2024
అనంతపురం రేంజ్ పరిధిలో 41 మంది సీఐల బదిలీ

అనంతపురం రేంజ్ పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోసీ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 41 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వెంటనే తమకు కేటాయించిన స్థానాలలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 16, 2026
అందరికీ ధన్యవాదాల: అనంత కలెక్టర్

గుత్తి పట్టణంలో తొలిసారిగా రెండు రోజులపాటు నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
News March 16, 2026
114 అర్జీలను స్వీకరించాం: అనంత ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 114 పిటీషన్లు స్వీకరించినట్లు ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పిటీషనర్లు, వీరి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించామన్నారు.
News March 16, 2026
అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో కలెక్టర్ ఆనంద్ అధికారులు అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 405 అర్జీలను సంబంధిత శాఖలు నిర్ణీత గడువులో పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


