News August 9, 2024

నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకుంది మన తెనాలి అమ్మాయినే

image

హీరో నాగ చైతన్య శోభితా ధూళిపాళ్ల గురువారం నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శోభితా స్వస్థలం తెనాలి అన్న విషయం బాగా వైరల్ అవుతుంది. తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు JVL శాస్త్రి, కమలమ్మ దంపతుల కుమార్తె శాంతాకామాక్షి. ఆమె తెనాలిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమెకు విశాఖకు చెందిన వేణుగోపాల్‌తో వివాహమైంది. వీరికి శోభిత, సమంత సంతానం. ఇద్దరూ తెనాలిలోనే పుట్టారు. అనంతరం ముంబాయిలో స్థిరపడ్డారు.

Similar News

News March 10, 2026

వేసవి కార్యాచరణకు సిద్ధం: GNT కలెక్టర్

image

రానున్న వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వేసవి కార్యాచరణకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఈ సందర్భంగా తెలిపారు. తాగునీటి సరఫరా, వైద్యం, అగ్నిమాపక సేవలపై రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.

News March 10, 2026

ఉండవల్లి: ప్రమాదంలో వృద్ధురాలు స్పాట్‌డెడ్

image

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన నల్లమట్టి టిప్పర్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అనుమతులు లేకుండా, అతివేగంతో మట్టి లారీలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 10, 2026

అమరావతిలో డబుల్ ట్రీ హిల్టన్ హోటల్‌కు భూమిపూజ

image

అమరావతి ప్రాంతంలోని మందడంలో 200 గదులతో ఫైవ్ స్టార్ డబుల్ ట్రీ (హిల్టన్) హోటల్, 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. రూ.330 కోట్ల పెట్టుబడితో 4 ఎకరాల్లో హోటల్, 2.5 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.