News August 9, 2024
జడ్చర్ల: ఒకే ఇంటిలో 6 పాములు

ఒకే ఇంటి ఆవరణలో 6 పాములను పట్టుకున్న ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. ఉదండాపూర్ గ్రామంలో మేస్త్రీ పనిచేసే సోమయ్య ఇంటి బెస్మెంట్‌లోని రంధ్రంలో పాము కనిపించింది. వారు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సదాశివయ్యకు సమాచారం అందించారు. శిష్యులు రాహుల్, చంద్రశేఖర్‌తో కలిసి వెళ్లిన సదాశివయ్య.. ఆ రంధ్రంలో ఆరు పాములను గుర్తించి పట్టుకున్నారు. అయితే ఆ పాములన్నీ విషరహితమైనవే అని తెలిపారు.
Similar News
News January 30, 2026
మహబూబ్‌నగర్: నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపాలిటీల్లోని కేంద్రాలను సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు, అనుచరులు శాంతియుతంగా సహకరించాలని కోరారు.
News January 30, 2026
MBNR: బీఫామ్ అందించడానికి బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు

మహబూబ్ నగర్ నగరపాలికలోని 60 డివిజన్‌లు ఉన్నాయి. అందులో బీజేపీ 43 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇంకా పలువురుని ఖరారు చేసే ఆలోచనలో ఉందని సమాచారం. ఇందులో తమకు టికెట్ దక్కని వారు ఇలాంటి ఆవేదనకు గురి కావద్దని తమ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ జిల్లా నాయకులు చెబుతున్నారు.
News January 30, 2026
MBNR: 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ.. నేడే లాస్ట్

MBNR :ఎస్సీ స్టడీ సర్కిల్ నందు 5 నెలల ఉచిత శిక్షణకు (GROUP-1,2,3&4 BANKING, SSC, RRB,) నేటితో గడువు ముగియనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో డిగ్రీ అర్హత గల SC, ST, BC, and Minority అభ్యర్థులు https://www.tsstudycircle.co.in” నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత భోజనం, వసతి, Books, నిష్ణార్థులైన అధ్యాపకులచే బోధన ఉంటుందన్నారు.


