News August 9, 2024
హైదరాబాద్: సెలవు ఇవ్వాలని డిమాండ్

ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని TPTLF(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్) డిమాండ్ చేస్తోంది. నాంపల్లిలో విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకి మెమోరాండం అందజేశారు. రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్ జునుగారి, నాయకులు సాయి కిరణ్ ఉన్నారు.
Similar News
News January 1, 2026
HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్‌ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.
News January 1, 2026
HYDలో కొత్త జిల్లా.. త్వరలో ఉత్తర్వులు?

రాజధానికి 4 కమిషనరేట్‌లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్‌నగర్‌ను HYDలో కలపనుందట.
News January 1, 2026
HYDలో బిర్యానీ తిని ఒకరి మృతి.. 15మంది సీరియస్

న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానినగర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందగా మరో 15 మంది సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


