News August 9, 2024

హైదరాబాద్: సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని TPTLF(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్) డిమాండ్ చేస్తోంది. నాంపల్లిలో విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకి మెమోరాండం అందజేశారు. రోజు‌కు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్ జునుగారి, నాయకులు సాయి కిరణ్ ఉన్నారు.

Similar News

News September 25, 2024

‘HYDలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి’

image

హైదరాబాద్‌లో సుప్రీం కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని, దానికోసం సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం కర్నూల్‌లో హై కోర్డు బెంచ్, అమరావతిలో లా యూనివర్సీటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

News September 25, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

హైదరాబాద్‌కు బుధవారం వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నగరంలో నిన్నటి మాదిరిగానే మళ్లీ మధ్యాహ్నం, రాత్రి సమయంలో (వరుసగా 6వ రోజు) ఉరుములతో కూడిన వర్షం పడనుంది అని తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్వీట్ చేశారు. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో HYDలో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసిన GHMC సహాయక చర్యలు చేపడుతోంది.

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.