News August 9, 2024

విజయనగరంలో అంగన్వాడీలపై కేసు కొట్టివేత

image

2017 టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతలపై పెట్టిన కేసులను మొబైల్ కోర్టు తాజాగా కొట్టి వేసింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని 2017 సెప్టెంబర్ నెలలో కలెక్టరేట్ వద్ద సీఐటీయూ నేతలతో కలిసి అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని అంగన్వాడీ, సీఐటీయూ నేతలపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం కేసు సరైంది కాదని కోర్టు కొట్టివేసింది.

Similar News

News December 29, 2025

PGRS ఫిర్యాదుల్లో 95 శాతం పరిష్కరించాం: VZM SP

image

2025లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా జిల్లాలో 2,038 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 1,930 ఫిర్యాదులను పరిష్కరించామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇంకా 108 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మొత్తం ఫిర్యాదుల్లో 95 శాతం పరిష్కారం జరిగిందని వెల్లడించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూవివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించినవే ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

News December 29, 2025

VZM: ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు

image

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్లతో నిఘా పెట్టి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 5 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం తెలిపారు. అయ్యన్నపేట శివారు ప్రాంతం, కలెక్టర్ కార్యాలయం, పీజీఆర్ ఆసుపత్రి పరిసరాల్లో డ్రోన్ల సహాయంతో రైడ్స్ నిర్వహించామని చెప్పారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టేందుకు డ్రోన్ల వినియోగం కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

News December 29, 2025

విజయనగరంలో నేడు ఉదయం 10 గంటలకే ప్రారంభం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి 1 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.