News August 9, 2024
OLYMPICS: అందంగా ఉందని ఇంటికి పంపారు!

పారిస్ ఒలింపిక్స్‌లో పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోకు చేదు అనుభవం ఎదురైంది. అందంగా ఉండి తోటి క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేసిందంటూ ఆమెను పరాగ్వే బృందం స్వదేశం పంపింది. స్విమ్ సూట్లతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ తన సొంత టీమ్‌కు చిరాకు తెప్పిస్తోందని, తమ క్రీడాకారుల ఏకాగ్రతను దెబ్బ తీస్తోందని భావించి ఈ చర్యలు తీసుకుంది. కాగా ఇంటికెళ్లిన మరుసటి రోజే ఆమె స్విమ్మింగ్‌కు గుడ్ బై చెప్పారు.
Similar News
News January 15, 2026
HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.
News January 15, 2026
BISAG-Nలో గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు

భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N)లో 5 గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్, ఎంసీఏ, డిప్లొమా(గ్రాఫిక్స్)అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55,000 వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://bisag-n.gov.in/
News January 15, 2026
ముగిసిన ఖర్మాస్.. ఇక శుభకార్యాల జోరు!

గత నెల రోజులుగా కొనసాగిన ఖర్మాస్ (అశుభ కాలం) నిన్నటితో ముగిసింది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. దీంతో ఇకపై వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, ఆస్తి కొనుగోళ్లకు తలుపులు తెరుచుకున్నాయి. దేవతల కాలం మొదలైనందున ఈ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్ర మౌఢ్యమి FEB 17 వరకు ఉంది.


