News August 9, 2024
Stock Market: లాభాలతో ప్రారంభం
దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్ల లాభాలతో నేడు ట్రేడింగ్ ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగియడంతో మాంద్యం భయాలు ఇక తగ్గినట్లే అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, నిరుద్యోగం పెరుగుదలతో మార్కెట్లు స్థిరంగా పుంజుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 17, 2025
7 కోట్లు దాటిన భక్తజనం.. రష్యన్ బాబాను చూశారా?
యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. గంగా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానమాచరించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని సమాచారం. ఈ మేళాలో రష్యన్ సాధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడడుగుల ఎత్తున్న ఆయనను పలువురు పరశురాముడిగా పిలుస్తున్నారు. ఆయన టీచింగ్ కెరీర్‌ను వదిలేసి నేపాల్‌లో ఉంటున్నారు.
News January 17, 2025
పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు: నాదెండ్ల
AP: సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో ‘తల్లికి వందనం’ అమలు చేస్తామన్నారు. Dy.CM పవన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News January 17, 2025
ఆటగాళ్లపై నిబంధనలు విధించిన BCCI
ఇటీవల టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన దృష్ట్యా BCCI ఆటగాళ్లపై నిబంధనలు విధించింది. ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే దేశవాళీలో ఆడటం తప్పనిసరని పేర్కొంది. కుటుంబ సభ్యులను వెంట తీసుకొచ్చే విషయంలో కోచ్, సెలక్షన్ ఆమోదం ఉండాలని తెలిపింది. లగేజీ పరిమిత బరువు ఉండాలని పేర్కొంది. వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని, ముందుగానే ప్రాక్టీస్ సెషన్లు వీడొద్దని ప్లేయర్లకు స్పష్టం చేసింది.