News August 9, 2024
‘జన్మభూమి’ అంటే ఏంటో తెలుసా?

AP: ఉమ్మడి ఏపీలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు. జన్మభూమిలో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రవాసులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసేలా చేశారు. ఇప్పుడు జన్మభూమి 2 కింద అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని CM చంద్రబాబు చెప్పారు.
Similar News
News March 28, 2026
మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.
News March 28, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in
News March 28, 2026
16ఏళ్లలోపు పిల్లలకు ఇండోనేషియాలో SM బ్యాన్!

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశంలో 16ఏళ్లలోపు పిల్లలు SM వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 16ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. ఆస్ట్రేలియా తర్వాత ఈ తరహా కఠిన చట్టాన్ని తెచ్చిన దేశంగా ఇండోనేషియా నిలిచింది.


