News August 9, 2024
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఇటీవల పుంగనూరులో జరిగిన టీడీపీ శ్రేణుల దాడిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం శాఖ ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిరంతరం ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఉండబోతుంది.
Similar News
News January 13, 2026
ప్రొద్దుటూరు నూతన DSPగా విభూ కృష్ణ

కడప జిల్లా ప్రొద్దుటూరు DSP భావనను అధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విభూ కృష్ణను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. డీఎస్పీ ఇతర పోలీసు అధికారులపై ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి బహిరంగంగా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే బదిలీ చేశారని తెలుస్తోంది. విభూ కృష్ణ ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా ఉన్నారు. త్వరలో DSP బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 13, 2026
కడప: మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు!

కడప జిల్లాలో గతనెల 1,43,405 కేసుల లిక్కర్ (IML), 54,938 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.98.98 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9,658 కేసులు లిక్కర్, 3,991 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.7.23 కోట్ల ఆదాయం లభించింది. APలో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.
News January 13, 2026
కడప జిల్లాలో పోస్టింగ్.. భర్త SP.. భార్య JC.!

కడప JCగా నూతనంగా నిధి మీనా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీమణి. ఈమెది 2019 ఐఏఎస్ బ్యాచ్. మొదటగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వయోజన విద్య డైరెక్టర్‌గా, ఎన్టీఆర్ JCగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు కడప JCగా పనిచేసిన అదితిసింగ్ ప్రసూతి సెలవులో ఉన్నారు.


