News August 9, 2024

గుంటూరు: గిరిజన అభ్యర్థులకు ఉచితంగా DSC శిక్షణ

image

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగాంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గిరిజన (ఎస్టీ) విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టరు ఎస్.నాగలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి టెట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. మహిళలకు 33.1/ 3 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు.

Similar News

News March 17, 2026

పుకార్లు నమ్మొద్దు, రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: నాదెండ్ల

image

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవొద్దని ఆయన సూచించారు. రోజుకు 2.81 లక్షల బుకింగ్స్ వస్తుంటే, అంతకంటే ఎక్కువగా 2.92 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు OTP ద్వారా గ్యాస్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్యానికి వాడిన వారిపై 616 కేసులు నమోదు చేశామన్నారు.

News March 17, 2026

GNT: నాటకరంగ దిగ్గజం పెద్ది రామారావు

image

రచయిత పెద్ది రామారావు గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామంలో 1973 మార్చి 17న జన్మించారు. ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పీహెచ్‌డీ చేశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రసిద్ధ ‘ఋతురాగాలు’ సీరియల్‌కు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ‘యవనిక’ అనే నాటక మాసపత్రికను నడిపి నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. చిరంజీవి ‘అందరివాడు’, ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలకు ఆయన సహ రచయితగా కూడా వ్యవహరించారు.

News March 17, 2026

నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నేటి పర్యటన వివరాలు ఖరారయ్యాయి. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) పనితీరుపై అధికారులతో ఆయన కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.