News August 9, 2024

సుంకిశాల ఘటనకు రేవంతే బాధ్యుడు: కేటీఆర్

image

TG: <<13805045>>సుంకిశాల<<>> ఘటనపై ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుంకిశాల విపత్తు విషయం ప్రభుత్వానికి తెలియదా? తెలిస్తే ఎందుకు వారం రోజులు గోప్యత పాటించారు? తెలియకపోతే అది ప్రభుత్వానికే సిగ్గుచేటు. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి. దీనికి వందశాతం సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News March 4, 2026

కల్తీ నెయ్యి నివేదికను సుబ్బారెడ్డి తొక్కిపెట్టారు: పయ్యావుల

image

AP: తిరుమల కల్తీ నెయ్యిపై చర్చ మండలిని కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. CFTRI నివేదిక నెయ్యి కల్తీపై స్పష్టత ఇచ్చినా, దాన్ని YV సుబ్బారెడ్డి తొక్కిపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. YCP హయాంలో TTD నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారని ధ్వజమెత్తారు. జంతు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలున్నాయంటూ NDDB రిపోర్ట్ కూడా చెప్పిందని TDP MLC అనురాధ విమర్శించారు.

News March 4, 2026

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

image

ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $82.66కు చేరింది. అయితే ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా చూస్తామని, అవసరమైతే హార్ముజ్ జలసంధిలో నౌకలకు తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని ట్రంప్ హామీ ఇవ్వడంతో ధరల పెరుగుదల వేగం తగ్గింది. ఈ వారంలో బ్రెంట్ క్రూడ్ ధర 12% పెరిగింది. ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్‌కు ఇది ఆర్థికంగా భారం కానుంది.

News March 4, 2026

కూటమి హయాంలో దేవాలయాల్లో అపచారాలు: YCP MLC

image

AP: హెరిటేజ్ ఎప్పుడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదంటూ CM CBN అబద్ధాలు చెప్పారని YCP MLC చంద్రశేఖర్ మండలిలో ఆరోపించారు. ‘2014-19 మధ్య ప్రభుత్వం హెరిటేజ్ మజ్జిగ కొనుగోలు చేసింది. TDP హయాంలోనే RTC టికెట్లపై జెరూసలెం యాత్ర ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో అపచారాలు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి టికెట్ల తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలంలో గోడకూలి ఏడుగురు మరణించారు’ అని విమర్శించారు.