News August 9, 2024

పల్నాడు జిల్లాలో మహిళ దారుణ హత్య

image

నాదెండ్ల మండలం గణపవరంలో మహిళ హత్య కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. షేక్ కరిమూన్ అనే మహిళ ఒంటరిగా గ్రామ మసీదులోని ఓ గదిలో ఉంటుంది. ఒడిశా నుంచి కూలి పనికి వచ్చిన రాజు కూడా అదే మసీదులో ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి కరిమూన్ గదిలోకి ప్రవేశించి ఆమెను హత్య చేసి పరారయ్యాడు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 22, 2026

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

image

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..

News March 22, 2026

గ్యాస్ కొరత లేదు.. ఆందోళన పడొద్దు: గుంటూరు JC

image

గుంటూరు జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ భరోసా ఇచ్చారు. గుంటూరు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీను శనివారం జేసీ తనిఖీ చేశారు. ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లు, బుకింగ్ చేసినవి, అందుబాటులో ఉన్న సిలిండర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి బుక్ చేసిన వివరాలు అడిగి తెలుసున్నారు.