News August 9, 2024

Hatsoff: రాష్ట్రానికి మాజీ సీఎం అయినా..

image

నిన్న కన్నుమూసిన బుద్ధదేవ్ భట్టాచార్య 11ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ సీఎంగా పనిచేశారు. జీవితమంతా కమ్యూనిజం విలువలతో బతికిన ఆయన మరణానంతరమూ వాటినే అనుసరించారు. ఎటువంటి అంతిమ సంస్కారాలూ వద్దని ముందుగానే నిర్ణయించుకున్నారు. అవయవాలను దానానికి, శరీరాన్ని పరిశోధనలకు ఇచ్చేశారు. దీంతో ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ కుటుంబీకులు NRS మెడికల్ కాలేజీ-ఆస్పత్రికి బుద్ధదేవ్ మృతదేహాన్ని ఈరోజు అప్పగించనున్నారు.

Similar News

News March 17, 2026

సీఎం హార్వర్డ్ కోర్సుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించింది: KTR

image

TG: సీఎం రేవంత్ <<18999625>>హార్వర్డ్<<>> కోర్సు ఫీజులు, విమాన ఖర్చులు ప్రభుత్వమే చెల్లించిందని అసెంబ్లీలో KTR ఆరోపించారు. ‘RTI ద్వారా వివరాలు తెలుసుకున్నాం. సర్కార్ విద్యాశాఖ మంత్రి(రేవంత్) ఫీజులు కడుతుంది కానీ రాష్ట్రంలోని విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించదా? గురుకులాల్లో నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది. యూనివర్సిటీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది’ అని మండిపడ్డారు.

News March 17, 2026

20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

image

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.

News March 17, 2026

పాక్ దాడి పిరికిపంద చర్య: భారత్

image

అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై <<19403539>>పాకిస్థాన్ దాడిని<<>> భారత్ ఖండించింది. రంజాన్ వేళ ఇలా చేయడం దారుణమని మండిపడింది. దీన్ని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇది మిలిటరీ దాడి కాదు మారణహోమమని పేర్కొంది. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కాగా పాక్ దాడిలో దాదాపు 400 మంది అమాయకులు మరణించారు.