News August 9, 2024

తిరుపతి: టీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలి: ఎంపీ

image

టీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. సుమారు 50 మంది ఇంజనీరింగ్, ఇతర శాఖల ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఇది ఉద్యోగస్తులను బెదిరించడమేనని వెల్లడించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, కూటమి నాయకులు వేధింపులు మానుకోకపోతే పార్లమెంటుకు దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

Similar News

News March 28, 2026

జీడీ నెల్లూరు వ్యక్తి బ్లాక్‌మెయిల్ దందా.. రూ.50 లక్షలు డిమాండ్

image

జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్ట్రార్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ దందాకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

News March 27, 2026

ముగిసిన నారా భువనేశ్వరి కుప్పం పర్యటన

image

CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

News March 27, 2026

చిత్తూరు: ఈ నంబర్లు సేవ్ చేసుకోండి..!

image

వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు DFO పెద్దిరెడ్డి సూచించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే స్థానిక అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చిత్తూరు: 08572-228101
కుప్పం: 08570-255099
నగరి: 08577-236122
పలమనేరు:08579-252399
పుంగనూరు: 08581-253101