News August 9, 2024

కరుడుగట్టిన టెర్రరిస్ట్ అరెస్ట్

image

స్వాతంత్య్ర దినోత్స‌వానికి కొన్ని రోజుల ముందు ఢిల్లీ పోలీసులు క‌రుడుగ‌ట్టిన‌ ఐసిస్ మాడ్యూల్ టెర్రరిస్టు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీని అరెస్టు చేశారు. అతనిపై NIA గ‌త ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసి రూ.3 లక్షల రివార్డు ప్రకటించింది. గ‌తంలో పూణె పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకున్న రిజ్వాన్ తాజాగా ఢిల్లీలోని దర్యాగంజ్‌లో ప‌ట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 25, 2025

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

image

<>DRDO <<>>అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ 5 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MS, MSc, ME, M.TECH, పీహెచ్‌డీ, బీఈ, బీటెక్, నెట్, గేట్ అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News October 25, 2025

మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్‌పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.

News October 25, 2025

వరుస డకౌట్ల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ

image

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ బాదారు. 56 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఇది 75వ హాఫ్ సెంచరీ. తొలి 2 వన్డేల్లో డకౌట్ల తర్వాత విరాట్ ఫామ్ అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోహిత్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. ఆయన 80కి చేరువలో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో భారత్ విజయం వైపు పయనిస్తోంది. గెలుపుకు మరో 66 రన్స్ కావాలి.