News August 9, 2024
యువ రైతు ప్రాణం తీసిన ‘ధరణి’!

TG: ‘ధరణి’లో భూమి రిజిస్టర్ కాలేదనే మనస్తాపంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు రాజేశ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. జక్రాన్‌పల్లి మం. అర్గుల్‌కు చెందిన రాజేశ్ వ్యవసాయంతో పాటు వ్యాపారంలో రూ.12 లక్షలు నష్టపోయాడు. తన 2 ఎకరాల భూమిని అమ్మేసి బాకీని తీర్చాలని ప్రయత్నించాడు. ధరణి పోర్టల్‌లో భూమి నమోదు కాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Similar News
News March 17, 2026
రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.
News March 17, 2026
KKRకు గాయాల ‘దెబ్బ’

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.
News March 17, 2026
ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు GHMC ఇటీవల ప్రకటించింది. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.


