News August 9, 2024
ప.గో.: ఎమ్మెల్యే RRR కేసులో బెయిల్‌కు నిరాకరణ
వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ ఉండి MLA రఘురామకృష్ణ మాజీ సీఎం జగన్ సహా.. సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్‌పై ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. కాగా గుంటూరు, నగరపాలెం పోలీసులు నమోదుచేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇప్పించాలని విజయ్ పాల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్ట్ నిరాకరించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
Similar News
News November 26, 2024
ఏలూరు: ఇద్దరు మిత్రులు అరెస్ట్.. 6 కార్లు రికవరీ
ఏలూరులో సెల్ఫ్ డ్రైవింగ్‌కు కార్లను తీసుకుని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేసుకుంటున్న అభిషేక్ (34), భానుచందర్ (39) అనే ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకున్నామని ఏలూరు రేంజ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు ముద్దాయిల నుంచి 6 కార్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. పత్రాలు లేకుండా బైక్, కార్లు తాకట్టు పెట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 26, 2024
జగన్‌పై Dy.స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన మాట్లాడారు. జగన్ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు, అసెంబ్లీకి రావాలని పేర్కొన్నారు. ‘ఆయనకు ప్రతిపక్ష హోదాను ప్రజలే తిరస్కరించారు. నేను ఎంపీగా ఉన్న సమయంలో దారుణంగా హింసించారు. నన్ను చంపాలని కూడా చూశారు. అప్పటి పెద్దలు చెప్పడంతోనే నాపై రాజద్రోహం కేసు పెట్టారు’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
News November 26, 2024
దోషరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
దోషరహిత ఓటరు జాబితాను రూపొందించడంపై సంబంధిత అధికారులు కృషి చేయాలని ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం.నాయక్ చెప్పారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి 2005 ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై సమీక్షించారు. జిల్లాలో 18-20 సంవత్సరాల వయస్సు కలిగిన యువతను ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్ధులను నూతన ఓటర్లుగా చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.