News August 9, 2024

HYD: నాగులపంచమి: ‘పాములను హింసించవద్దు’

image

నాగులపంచమి రోజున పూజల పేరుతో పాములను పట్టుకుని హింసించవద్దని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్‌ అధ్యక్షుడు జస్‌రాజ్‌శ్రీ శ్రీమల్, ప్రధాన కార్యదర్శి మహేశ్‌ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పాములను హింసించే వారి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు తెలియజేస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు. 

Similar News

News December 29, 2025

HYD కుర్రాళ్ల ‘విష్ జార్’ మాయ

image

కోడింగ్ రాసి అలసిపోతున్న మన Gen-Z బ్యాచ్ కొత్త ట్రెండ్ అందుకుంది. 13-wish jar మంత్రం జపిస్తోంది. ఆఫీసు గొడవలు మర్చిపోవాలని చిట్టీలు రాసి తగలబెడుతున్నారు. లక్ష్యాలను మధ్యలోనే వదిలేస్తామని భయం ఉన్నా 43% మంది డిజిటల్ మాయ వద్దని ఫిక్స్ అయ్యారు. స్క్రీన్ టైమ్ తగ్గించాలన్నది వీరి ప్లాన్. ట్రాఫిక్ జామ్ మధ్య స్లో లివింగ్ మజా వెతుక్కుంటున్నారు. సిటీ కుర్రాళ్లంతా రియల్ లైఫ్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు.

News December 29, 2025

మిగిలింది గ్రేటర్ హైదరాబాదే!

image

TGలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు EC సమాయత్తం అవడంతో గ్రేటర్‌లో చర్చ మొదలైంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌‌ ఇదే కావడంతో ఇక్కడి పీఠం మీద ప్రధాన పార్టీలు గురి పెడుతున్నాయి. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడేమో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల‌ ఎన్నికలకు EC ప్రిపేర్ అవుతోంది. అయితే, GHMC పాలకవర్గం FEB-2026లోనే ముగియనుంది. దీంతో HYDలో ఎన్నికలు ఎప్పుడు? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

News December 29, 2025

విజయ్ హజారేలో హైదరాబాద్ బే‘జారే’!

image

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మూడో సారి ఓటమి పాలైంది. సోమవారం జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో అస్సాం 4 వికెట్ల తేడాతో HYDను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అస్సాంలో శిబ్‌శంకర్ రాయ్ (112) మెరుపు సెంచరీ చేశాడు. సౌరవ్ (91) పరుగులతో రాణించాడు. దీంతో లక్ష్యాన్ని ASM 49.3 ఓవర్లలో సాధించి విజేతగా నిలిచింది.