News August 9, 2024
మీకు తెలుసా: ఈ దేశాల్లో నదులే లేవు!

ఏ దేశానికైనా నదులు జీవనాధారం. కానీ ఒక్క నదీ లేని దేశాలు ప్రపంచంలో 19 ఉన్నాయి. వరల్డ్ అట్లాస్ వెబ్‌సైట్ ప్రకారం.. సౌదీ అరేబియా, UAE, ఒమన్, ఖతర్, కువైట్, యెమెన్, కొమొరోస్, డిజిబౌటీ, లిబియా, బహమాస్, బహ్రెయిన్, మాల్దీవులు, మాల్టా, మొనాకో, వాటికన్ సిటీ, కిరిబాటీ, నారు, తువాలూ, టోంగా దేశాల్లో నదులు లేవు. వీటిలో కొన్ని ఎడారి దేశాలు కాగా మరికొన్ని ద్వీపాలు.
Similar News
News March 13, 2026
పంత్ మరో అభిషేక్ అవుతాడా?

LSG కెప్టెన్ రిషభ్ పంత్ గత IPL సీజన్‌లో బ్యాటింగ్‌లో తడబడిన సంగతి తెలిసిందే. RCBపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో రాణించలేకపోయారు. దీంతో ఈసారి యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల 4 రోజులపాటు ముంబైలో బ్యాటింగ్ సెషన్లు జరిగాయి. గతంలో అభిషేక్ శర్మ, గిల్, ప్రభ్‌సిమ్రాన్ వంటి బ్యాటర్లకు యువీ శిక్షణనిచ్చారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌లా పంత్ రాణిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
News March 13, 2026
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5min ఆలస్యమైనా అనుమతి

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఉ.9.35 వరకూ స్టూడెంట్స్‌ను ఎగ్జామ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనుండగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.
News March 13, 2026
నేటి నుంచి మరోసారి థియేటర్లలో ‘ధురంధర్’

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ధురంధర్’ ఇవాళ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా వెయ్యికి పైగా స్క్రీన్లలో 1250కి పైగా షోలు వేయనున్నట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ప్రకటించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై రూ.1350కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘ధురంధర్-2’ ఈ నెల 19న తెలుగులోనూ విడుదల కానుంది.


