News August 9, 2024

అంబానీ ఫ్యామిలీ సంప‌ద 10% GDPతో స‌మానం!

image

కంపెనీల వ్యాల్యూయేషన్ పరంగా ముకేశ్ అంబానీ కుటుంబ సంపద మనదేశ జీడీపీలో 10 శాతంతో సమానమని తేలింది. బార్ల్కేస్-హురున్ ఇండియా నివేదిక ప్ర‌కారం మార్చి 20, 2024 నాటికి వారి సంస్థ‌ల విలువ‌ రూ.25.75 ట్రిలియ‌న్లు. తద్వారా దేశంలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ ఫ్యామిలీ మొద‌టి స్థానంలో నిలిచింది. ప్రైవేటు పెట్టుబ‌డులు, లిక్విడ్ అసెట్స్‌ను ఈ లెక్కింపు నుంచి మిన‌హాయించారు.

Similar News

News January 17, 2025

నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్, పలు రంగాల్లో పెట్టుబడులు, భూముల కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం చంద్రబాబు తన నివాసంలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్‌లతో సమావేశం కానున్నారు.

News January 17, 2025

సింగపూర్‌ వెళ్లిన సీఎం.. అటు నుంచే దావోస్‌కు

image

ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ తర్వాత నిన్న రాత్రి TG సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ బయల్దేరారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆయన వెంట వెళ్లింది. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయమై చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్‌లో పాల్గొనేందుకు దావోస్ వెళ్తారు. గత పర్యటనలో ప్రభుత్వం రూ.40వేల కోట్ల పెట్టుబడులు సమీకరించింది.

News January 17, 2025

VIRAL: ఇదేందయ్యా ఇది.. స్టూడెంట్ మూవీ రివ్యూ చూశారా?

image

సాధారణంగా స్కూళ్లలో విద్యార్థులకు సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, దర్శకుడు ఎవరనే విషయాల్లో ప్రశ్నలు అడుగుతారు. కానీ తన కజిన్‌కు మూవీ రివ్యూను హోంవర్క్‌గా ఇచ్చినట్లుగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. సలార్ మూవీకి విద్యార్థికి రివ్యూ ఇవ్వగా మా టైమ్‌లో ఇలాంటి హోమ్ వర్క్ ఉంటే బాగుండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సలార్ క్రేజీ ఇంకా కొనసాగుతోందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు.